వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా.. కృష్ణా జిల్లా మైలవరంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన ముళ్ల కంపలను.. స్థానిక ఎమ్మెల్యే వంసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు తొలగిస్తున్నారు. మురుగునీటి కాలువల పూడికతీత చేపట్టారు. రక్షిత మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. అధికారుల చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంటు వ్యాధుల నివారణకు.. ముందు జాగ్రత్త చర్యలు - krishna
కృష్ణా జిల్లా మైలవరంలో అధికారులు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
పారిశుధ్య కార్యక్రమాలు