ముదినేపల్లిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - undefined
తమకు ఏడాది నుంచి జీతాలు చెల్లించలేదని ముదినేపల్లి మండలానికి చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహించారు. కార్మిక నాయకులతో కలిసి మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.

కృష్ణా జిల్లా ముదినేపల్లిలో స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు చెల్లించాలంటూ గ్రీన్ అంబాసిడర్లు ఆందోళన చేపట్టారు. ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఏడాది నుంచి పనులు చేయించుకుని జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని కార్మికుల నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోల్ నాయుడు , సీఐటీయూ డివిజన్ కార్యదర్శి సుబ్బారావు పాల్గొన్నారు.