ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇసుక కొరతతో.. ఎడ్లబండ్లకు పెరిగిన డిమాండ్​

By

Published : Nov 6, 2019, 10:10 PM IST

ఇసుక కొరతతో ఎడ్లబండ్లకు డిమాండ్ పెరిగింది. నందిగామ మండలం రాఘవపురంలో ఇసుకను ఎడ్లబండ్లలో తరలిస్తూ విక్రయిస్తున్నారు.

ఎద్దులబండ్లతో ఇసుక రవాణా చేస్తున్న దృశ్యం

ఎడ్లబండ్లతో ఇసుక విక్రయాలు

కృష్ణాజిల్లా నందిగామ మండలం రాఘవపురంలో ఎడ్లబండ్లతో ఇసుక విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత నాలుగు నెలలుగా వరదలు రావడంతో ఇసుక లేక భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎడ్లబండ్లతో ఇసుకను తరలిస్తూ విక్రయిస్తున్నారు. ఒక్కో బండికి ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల చొప్పున ఇసుకను విక్రయిస్తున్నారు. పశువుల యజమానులు ఆదాయం కోసం ఎక్కువ సంఖ్యలో ఇసుకను తరలిస్తుంటే... ఎద్దులు నడవలేక ఇబ్బందులు పడుతున్నాయి.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details