కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారులోని దోనబండ చెక్ పోస్ట్ వద్ద ప్రమాదం జరిగింది. కంచికచర్ల నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ అదుపుతప్పి విభాగినిని ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుని స్వల్ప గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు... బాధితుడిని క్యాబిన్ నుంచి బయటకు తీశారు. చికిత్స కోసం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.