ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిల్లులు లేని 9 ఇసుక టిప్పర్ల స్వాధీనం.. కేసు నమోదు - Sand smuggling news at kanchikacharla

కృష్ణా నది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా విజయవాడ తరలిస్తున్న 9 ఇసుక టిప్పర్​లను కృష్ణా జిల్లా నందిగామ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

sand smuggling from the Krishna River at krishna district
కృష్ణా నది నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

By

Published : Nov 18, 2020, 3:47 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మున్నలూరులో కృష్ణా నది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా విజయవాడ తరలిస్తున్న 9 ఇసుక టిప్పర్లను నందిగామ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి కొన్ని లారీలకు బిల్లు తీసుకొని వాటి మధ్యలో బిల్లులు లేని ఇసుక టిప్పర్​లను తరలిస్తున్నారని... గుర్తించారు.

గట్టి నిఘా ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 9 ఇసుక టిప్పర్ లకు అనుమతి లేకుండా రవాణా చేస్తున్నారన్న... విషయాన్ని గుర్తించి కంచికచర్ల మార్కెటింగ్ యార్డుకు తరలించారు. ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

హార్టికల్చర్​ అధికారినంటూ మోసం.. రూ. 30లక్షలకు టోకరా

ABOUT THE AUTHOR

...view details