కృష్ణాజిల్లా.. అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల మండలం, శ్రీకాకుళం, అవనిగడ్డ మండలం, అవనిగడ్డలో ప్రభుత్వం ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసింది. ఇసుకను లారీల్లో అవనిగడ్డ స్టాక్ పాయింట్‌కు తేవడం.. అక్కడ అమ్మకాలు కొద్ది రోజులు జరిపినా ఆ తర్వాత ఇసుక స్టాక్ పాయింట్ మూతబడింది. ఘంటసాల మండలం, శ్రీకాకుళంలో స్టాక్ పాయింట్ వరదల కారణంగా గత రెండు నెలలుగా ఇసుక లేక అమ్మకాలు నిలిచిపోయాయి. నది పక్కన గ్రామాలకు ఎడ్లబండ్లతో ఇసుక తరలిస్తే అధికారులు ఏమి అనడం లేదని నాగాయతిప్ప గ్రామానికి ఇసుక ఎడ్లబండ్లతో తోలుకుంటామని అర్జీలు ఇస్తున్నా.. కనీసం వాటిని తీసుకోవడంలేదని నాగాయతిప్ప గ్రామస్థులు వాపోతున్నారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో ఇసుక కొరత ఎక్కువగా ఉండటంతో తాపీ కార్మికులకు సైతం పనులు దొరక్క అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాలు కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో ఉండటం వలన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాల వలన నది ఒడ్డు ఎక్కువగా కోతకు గురయ్యాయి. దీంతో నదిలో ఇసుక తవ్వకాల వలన భూగర్బ జలాలు తగ్గిపోవడం.. సముద్రపు నీరు పంట పొలాల్లోకి రావడం వలన పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.