గత నెలలో కురిసిన భారీ వర్షాల ప్రభావం ఇసుక రవాణాపై ప్రభావం చూపుతోంది. కృష్ణా జిల్లాలో మున్నేరు నదీ పరివాహక గ్రామాల్లో ఇసుక రవాణా భారంగా మారుతుంది. పరీవాహక గ్రామాల్లో గతం నుంచి ఎడ్లబండ్ల ద్వారా ఇసుక రవాణా చేసేందుకు అనుమతులు ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలకు ఎడ్లబండ్ల ద్వారానే రవాణా జరిగేది. భారీగా వరదల కారణంగా గ్రామాల్లో ఎడ్లబండ్లు నదిలోకి దిగే ప్రాంతాలు కోతకు గురయ్యాయి. నదిలో కొన్ని చోట్ల మాత్రమే అతికష్టంగా నీటి పాయల్లో నుంచి ఎడ్లబండ్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. గతం కంటే అధికంగా రవాణా చార్జీలు తీసుకుంటున్నారు. గృహనిర్మాణ దారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇసుకను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
మున్నేరులో ఇసుక కష్టాలు.. అధిక ధరలతో నిర్మాణదారులు బెంబేలు
కృష్ణా జిల్లాలో మున్నేరు నదీ పరివాహక గ్రామాల్లో ఇసుక రవాణా భారంగా మారింది. గత నెల వరదల కారణంగా ఇసుక రవాణా కష్టమైంది. ఇసుక ధరలూ అమాంతంగా పెరిగాయి. దీంతో గృహ నిర్మాణదారులు బెంబేలెత్తుతున్నారు.
పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు, సుబ్బయ్యగూడెం, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, శనగపాడు, వత్సవాయి మండలం లింగాల, కన్నెవీడు, ఇందుపల్లి గ్రామాల పరిధిలో బండి ఇసుక 250 లభ్యమయ్యేది. వరదల తర్వాత బండి ఇసుక ధర రూ.500కు పెంచారు. నది నుంచి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటే వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నారు. 6 బండ్లు కలిపితే ఒక ట్రాక్టర్ ఇసుక వస్తుంది. ఈ విధంగా ట్రాక్టర్ ఇసుక ధర మూడు వేలు ఉండగా.. ఐదు కిలోమీటర్ల దూరం అయితే 6000 పలుకుతోంది.
ఇదీ చదవండి: బదిలీలు చేశారు..నియామకాలేవీ ?