కృష్ణా జిల్లాలో మరో ఇసుక దందా బయటపడింది. అక్రమంగా తరలించిన 175 టన్నుల ఇసుకను కంచికచర్ల పోలీసులు సీజ్ చేశారు. కంచికచర్ల మార్కెట్ యార్డు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) ఏఎస్పీ వకుల్ జిందాల్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
కొందరు వ్యక్తులు 18 టన్నుల ఇసుక తరలింపునకు బిల్లు తీసుకున్నారు. కానీ 25 టన్నులకు పైగా ఇసుకను తరలించారు. ఇసుక ర్యాంపు వద్ద ఉన్న ఓ జేసీబీ ఆపరేటర్ నిందితులకు సహకరించాడు. కంచికచర్ల, గొట్టుముక్కల, కొండపల్లి పరిసర ప్రాంతాల్లో ఆరు చోట్ల ఇసుకను దిగుమతి చేసినట్లు గుర్తించాం. దీనికి సంబంధించి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశాం. ఒక టిప్పర్తోపాటు 175 టన్నుల ఇసుక సీజ్ చేశాం- వకుల్ జిందాల్ , కృష్ణా జిల్లా సెబ్ ఏఎస్పీ