కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరు రిచ్ వద్ద ఇసుక కొనుగోలుకు వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా తరలివస్తున్న ట్రాక్టర్లతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక ట్రాక్టరు వంతు రావడానికి 10గంటలకు పైగా సమయం పడుతుందని డ్రైవర్లు వాపోతున్నారు. ఒక్క ట్రాక్టర్ ఇసుక కోసం తిండి, నీరు లేకుండా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇసుక తరలింపు మరింత జాప్యం అవుతుందని డ్రైవర్లు చెబుతున్నారు. అదనపు కాసులకు ఆశపడి కొందరు అధికారులు అడ్డదారుల్లో ఇసుక రవాణాకు అనుమతిస్తున్నారన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి .
ఇసుక కోసం కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల బారులు - people
ఇసుక కొరత ట్రాక్టర్ డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. ఒక్క ట్రిప్పు ఇసుక కోసం కిలోమీటర్ల మేర బారులు తీరి.... తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. అందుబాటులో ఉన్న అతికొద్ది రీచ్‌లకి భారీగా తరలివస్తున్న ట్రాక్టర్లతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి.
sand-issue-problems
ట్రాక్టర్లు అధికంగా వస్తున్న పరిస్థితుల్లో ఇసుక రవాణాకు ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా చూస్తున్నామంటున్నారు. రీచ్‌కు చేరడానికి ఉన్న అన్ని దారులను పర్యవేక్షిస్తున్నామని ఆర్ఐ రవికిషోర్ తెలిపారు. జిల్లాలో ఉన్న ఇంకో రీచ్‌ను ప్రారంభించి తమ కష్టాలు తీర్చాలని ట్రాక్టర్ డ్రైవర్లు కోరుతున్నారు.