కృష్ణా జిల్లా చాట్రాయి మండలం టి.గుడిపాడు పరిధిలో అనుమతి లేకుండా మట్టి రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మట్టి రవాణా కొందరికి ఆదాయ వనరుగా మారి.. ఇష్టానుసారంగా రాత్రి సమయాల్లో తవ్వకాలు చేస్తున్నారు. అధికారులు సైతం చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
గుంటూరులో..
గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడెపురంలో అధికార పార్టీ నేత ఒకరు ఇళ్ల స్థలాల కోసం మట్టి తీసుకెళ్లటానికి అనుమతి తీసుకొని... ప్రైవేటు వెంచర్లకు, ప్రైవేటు వ్యక్తులకు తరలిస్తూ... పెద్ద ఎత్తున్న సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాత్రి, పగలు తేడలేకుండా 5 ఎకరాల విస్తీర్ణంలో 20 అడుగులకు పైగా తవ్వకాలు చేస్తూ.. ఒక్కొక్క టిప్పర్ మట్టి నింపడానికి రూ.3వేలు, ఒక్కో ట్రాక్టర్ కు రూ.600 చొప్పున సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది.