కృష్ణా జిల్లా మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామం వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుకను పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్ లారీలో 10 టన్నుల ఇసుకను తరలిస్తుండగా గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ సేకరించి.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కొండవీటి కోటేశ్వరరావు అనే వ్యక్తి బీవీఆర్ ఎంటర్ ప్రైజెస్ పేరు మీద కాంట్రాక్టర్ పనుల కొరకు బల్క్ బుకింగ్ చేశాడు. సుమారు 738 టన్నుల ఇసుకలో 300 టన్నుల ఇసుకను కాంట్రాక్టర్ పనులకు వాడి.. మిగిలిన 438 టన్నుల ఇసుకను అక్రమంగా దారి మళ్లించి.. అధిక ధరకు అమ్ముకుంటున్నాడు. తనకు తెలిసిన లారీ డ్రైవర్ల సహకారంతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నాడు.
ఇసుక అక్రమ రవాణాలో హైకెట్ దందా.. టన్నుల ఇసుక స్వాహా..!
ఇసుక అక్రమ రవాణా పెరిగిపోతోంది. టెక్నాలజీని ఉపయోగించి మరీ ఇసుకను మాయం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఏకంగా 738 టన్నుల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. జీపీఎస్ ఆధారంగా 300 టన్నుల ఇసుకను ఇప్పటి వరకు పట్టుకున్నారు. మిగిలిన 6 లారీల్లో తరలిస్తున్న 438 టన్నుల ఇసుకను పట్టుకోవల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
శ్రీకాకుళం ఇసుక క్వారీ నిర్వాహకులలో ఒకరైన నరేష్, లారీ ట్రాన్స్ పోర్ట్ కు చెందిన రమేష్ సహకారంతో అక్రమంగా ఇసుకను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఇప్పటి వరకు దారి మళ్లించిన సుమారు 331 టన్నుల ఇసుకను స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా అక్రమంగా ఆరు లారీల్లో తరలిస్తున్న ఇసుకను పట్టుకోవల్సి ఉందని.. కృష్ణాజిల్లా ఇంచార్జ్ అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి