ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక..ఉత్తర్వులు జారీ - ఏపీలో ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక సరఫరా

రాష్ట్రంలోని నదులు, వాగుల నుంచి ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లేందుకు వీలుగా నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా తరలిస్తే జరిమాన విధిస్తామని గనుల శాఖ స్పష్టం చేసింది.

ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక తెచ్చుకోవచ్చు
ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక తెచ్చుకోవచ్చు

By

Published : Jun 10, 2020, 3:03 AM IST

ప్రధాన నదుల నుంచి కూడా ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వాగులు, వంకల నుంచి మాత్రమే ఎడ్లబండ్ల ద్వారా ఇసుక తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఇకపై ప్రధాన నదులకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామస్థులు తమ అవసరార్ధం ఎడ్లబండ్లపై ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా నిబంధనలు సవరించారు. ఇలా తీసుకొచ్చిన ఇసుక నిల్వ చేసినా.. బ్లాక్‌మార్కెట్‌కు తరలించినా, వాణిజ్య అవసరాలకు వినియోగించినా జరిమానా విధించనున్నట్లు గనులశాఖ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details