సాగునీరు అందించి ఎన్నెస్పీ జోన్ - 2 ఎడమ కాలువ ఆయకట్టు రైతులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలిపారు. జగ్గయ్యపేట మండలంలోని గండ్రాయి మేజర్ కాలువ నుంచి పెనుగంచిప్రోలు వరకు గల కాలువను ఆయన నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
సాగునీరందించి రైతులను ఆదుకుంటాం: సామినేని ఉదయభాను - కాలువను పరిశీలించిన సామినేని ఉదయభాను తాజా వార్తలు
ఎన్నెస్పీ జోన్ -2 కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరందించి వారిని ఆదుకుంటామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను చెప్పారు. ఇదే విషయమై తెలంగాణ అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు .
తెలంగాణ నుంచి ఎన్నెస్పీ జోన్ ఎడమ కాలువకు ప్రతి ఏడాది 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేవలం 450 క్యూసెక్కుల సాగునీటిని మాత్రమే విడుదల చేస్తున్నారని, దాని వల్ల సుమారుగా 40వేల ఎకరాల వరి, మొక్కజొన్న, మిర్చి రైతులు నీటి ఎద్దడితో నష్టపోతున్నారన్నారు. ఖమ్మం జిల్లా నీటిపారుదల శాఖ సీఈ, ఎస్ఈఈలతో ఫోన్లో సంప్రదించినట్లు చెప్పిన ప్రభుత్వ విప్... తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:'మాకు ఉద్యోగ భద్రత కల్పించండి'