ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 24, 2022, 3:50 PM IST

Updated : Jan 24, 2022, 4:24 PM IST

ETV Bharat / state

సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం: సజ్జల

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

15:47 January 24

ట్రెజరీ ఉద్యోగుల చర్యలతో నోటీసు పీరియడ్‌కు అర్థం ఉండదు: సజ్జల

సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్న ఆయన.. ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ఉద్యోగుల బుజ్జగింపు, చిన్న అంశాల పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుందన్నారు. చర్చలకు వస్తారని రేపు కూడా ఎదురుచూస్తామన్న సజ్జల.. ఈమేరకు మరోసారి సమాచారం పంపుతామని వెల్లడించారు.

"ట్రెజరీ ఉద్యోగుల చర్యలతో నోటీసు పీరియడ్‌కు అర్థం ఉండదు. అలా చేస్తే క్రమశిక్షణలో ఉంచే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగుల ప్రతినిధులకు చెప్పేందుకే కమిటీ. అపోహలు తొలగించేందుకు చర్చలకు రావాలని కోరాం. పీఆర్సీ జీవోల అమలు నిలపాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. చర్చలకు వస్తేనే మిగతా అంశాల గురించి మాట్లాడగలం. జీఏడీ కార్యదర్శి చెప్పాక కూడా అధికారిక కమిటీ కాదంటారా? ఉద్యోగులు కూడా మా ప్రభుత్వంలో భాగమే. ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం" - సజ్జల రామకృష్ణారెడ్డి

మంత్రుల ఎదురుచూపులు..

పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలు చర్చకు వస్తాయని ఏపీ సచివాలయంలో మంత్రులు ఎదురుచూశారు. సచివాలయం రెండో బ్లాక్‌లో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో పాటు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి నిరీక్షించారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ సహా వివిధ అంశాలపై ప్రభుత్వంతో సోమవారం సంప్రదింపులకు రావాలని మంత్రులు పిలుపునివ్వగా ఉద్యోగ సంఘాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. చర్చలకు రాబోమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పినా మంత్రులు నిరీక్షించడం గమనార్హం.

Budha and Nagulmeera fired on Kodali: షర్మిల ఏపీలో పార్టీ పెడితే..చేరే తొలి వ్యక్తి కొడాలి నాని -బుద్ధా

Last Updated : Jan 24, 2022, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details