Sajjala On Teachers demands: ఆర్థిక పరిస్థితి వల్ల ఫిట్‌మెంట్ ఎక్కువ ఇవ్వలేకపోయామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నిన్ననే చెబితే ఉపాధ్యాయ సంఘాల సమస్యలు పరిష్కరించేవాళ్లమని వ్యాఖ్యానించారు. మినిట్స్ తయారయ్యాక బయటకు వెళ్లి మాట్లాడటం సరికాదన్నారు. ప్రభుత్వ పరిస్థితిని ఉద్యోగులు సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ఎవరూ కోరకున్నా ఉద్యోగ విరమణ వయసు 62కు పెంచామని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ అన్నట్లు ప్రభుత్వం ఎక్కడా ఆధిపత్య ధోరణి చూపలేదని స్పష్టం చేశారు.
"హెచ్‌ఆర్‌ఏ వల్ల టీచర్లకు అన్యాయం జరిగిందని చెబితే సరిచేశాం. మినిట్స్ తయారయ్యాక బయటకు వెళ్లి మాట్లాడటం సరికాదు. ప్రభుత్వ పరిస్థితిని ఉద్యోగులు సహృదయంతో అర్థం చేసుకోవాలి. మిగిలిన సమస్యలనూ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 'చలో విజయవాడ'లోనూ ప్రభుత్వం ఉద్యోగులను ఏమీ అనలేదు. పవన్ అన్నట్లు ప్రభుత్వం ఎక్కడా ఆధిపత్య ధోరణి చూపలేదు" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు
ప్రభుత్వం ఉద్యోగులదే..
cm ys jagan: ప్రభుత్వం.. ఉద్యోగులదనే విషయం గుర్తించాలని సీఎం జగన్ అన్నారు. ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశంలో మాట్లాడిన సీఎం.. ఉద్యోగుల సహకారం ఉంటేనే ఏదైనా చేయగల్గుతామని చెప్పారు. కొవిడ్, ఆర్థిక పరిస్థితుల్లోనూ చేయగల్గినంత చేశామని పేర్కొన్నారు. సమస్యలుంటే ప్రభుత్వాన్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చన్నారు. మంత్రుల కమిటీ నిర్ణయాలు సంతోషాన్ని ఇచ్చాయని భావిస్తున్నానని తెలిపారు.