ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయినంపూడి ఘటనలో సాయిరెడ్డి కుటుంబసభ్యుల అరెస్టు - ainampudi incident

కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి గ్రామంలో ఓ దళిత కుటుంబాన్ని వేధింపులకు గురి చేయడం, ఇంటికి నిప్పు పెట్టడానికి కారణమైన సాయిరెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Saireddy's family members were arrested in the ainampudi incident
అయినంపూడి ఘటనలో సాయిరెడ్డి కుటుంబసభ్యుల అరెస్టు

By

Published : Sep 7, 2020, 12:22 PM IST

కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి గ్రామంలో ఓ దళిత కుటుంబాన్ని వేధింపులకు గురి చేయడం, గృహ దహనానికి కారణమైన సాయిరెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలో ఏం జరిగింది....

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం శ్రీ హరిపురానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని, పక్క గ్రామమైన వడాలికి సాయిరెడ్డి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతి ఎస్సీ సామాజికవర్గానికి చెందడం వల్ల సాయిరెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి సాయిరెడ్డితో పాటు కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయిరెడ్డి కుటుంబం అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉండటంతో, కొంతమంది కేసు ఉపసంహరించుకోవాలని యువతి కుటుంబంపై ఒత్తిడి చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజీకి రాలేదని ఆక్రోశంతోనే తన కుటుంబ సభ్యులతో.. ఇంట్లో నిద్రిస్తుండగా, చంపడానికి ఇంటికి నిప్పు పెట్టారని యువతి ఆరోపిస్తోంది.

ఇదీ చదవండి:ప్రియురాలి ఇంటికి నిప్పుపెట్టిన ప్రియుడి కుటుంబ సభ్యులు!

ABOUT THE AUTHOR

...view details