కృష్ణా జిల్లాలో ఓ సచివాలయ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల ప్రకారం... తాడిగడప వార్డు సచివాలయం-3లో విధులు నిర్వహిస్తోన్న ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన సూర్యారెడ్డి తను నివాసం ఉంటున్న వసంతనగర్లోని గదిలో విగతజీవిగా పడిఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా... పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏదైనా పురుగుల మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద మృతి - etv bharat telugu updates
కృష్ణాజిల్లాలోని తాడిగడప వార్డు సచివాలయం-3లో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగి తన నివాస ప్రాంతం వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద మృతి