ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: సచివాలయ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం

అమరావతి సచివాలయంలో పలు శాఖల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. సచివాలయంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా.. ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులంతా ఇవాల్టి నుంచి 14వ తేదీ వరకూ ఇంటి నుంచే పని చేయాలని స్పష్టం చేశారు.

ap sachivalayam
ap sachivalayam

By

Published : Jun 8, 2020, 7:10 PM IST

అమరావతి సచివాలయంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కో ప్రభుత్వ శాఖ.. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఆదేశాలు జారీ చేస్తోంది. తాజాగా.. పరిశ్రమల శాఖ.. తమ ఉద్యోగులను ఇంటి నుంచే విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వులు జారీ చేశారు.

సచివాలయంలో పని చేస్తున్న పరిశ్రమల శాఖ ఉద్యోగులంతా నేటి నుంచి 14వ తేదీ వరకూ ఇంటి నుంచే పనిచేయాలని స్పష్టం చేసింది. ఈ వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా ఉత్తర్వుల్లో సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉద్యోగులంతా ఫోన్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details