కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఎక్కడికక్కడ 144 సెక్షన్ అమలు చేస్తూ..నిర్థిష్ట సమయంలోనే నిత్యవసరాలు కొనుగోలు చేయాలని చెప్పడంతో కూరగాయలు కొనేందుకు జనాలు ఎగబడ్డారు. కృష్ణాజిల్లా గుడివాడ రైతు బజార్‌కు అధిక సంఖ్యలో వినియోగదారులు వచ్చారు. కూరగాయలు అయిపోతాయి అన్న ఆందోళనతో వినియోగదారులు ఎగబడ్డారు. గుడివాడ రైతు బజార్ ఇరుకుగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. తాత్కాలికంగా పక్కనే ఉన్న ఎన్టీఆర్ క్రీడామైదానంలో ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
గుడివాడ రైతుబజార్లో కిక్కిరిసిన జనం... - latest rythu markets rush news in gudivada
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలో 144 సెక్షన్ విధించడంతో కూరగాయల కోసం కృష్ణాజిల్లా గుడివాడ రైతు బజార్ వినియోగదారులతో కిటకిటలాడింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుక్కునే అవకాశం కల్పించడంతో కూరగాయలు కొనడానికి రైతు బజార్‌కు ప్రజలు ఎగబడ్డారు.
గుడివాడ రైతుబజార్లో కిక్కిరిసిన జనం
TAGGED:
latest news of corona virus