కృష్ణా జిల్లా నాగాయలంకలో ఆంధ్రాబ్యాంకు ముందు ఖాతాదారులు బారులు తీరారు. ప్రభుత్వం అందజేస్తున్న వెయ్యి రూపాయల నగదును తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులు బ్యాంకు ముందు గుంపులుగా గుమిగూడారు. భౌతికదూరం పాటించకుండా ఇలా గుంపులుగా ఉండటంతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని అధికారులు, వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా..! - nagayalanka news today
కరోనా వ్యాప్తి నివారణకు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం, వైద్యులు చెబుతున్నా కొందరు పాటించడం లేదు. గుంపులుగా గుమిగూడుతూ వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు.

భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా..!