ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం ద్వారా వచ్చే డబ్బుల కోసం... మహిళలు బ్యాంకుల వద్ద బారులుతీరారు. విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతాల మహిళలు బ్యాంకుల వద్దకు భారీగా తరలివచ్చారు. డబ్బులు తక్షణమే తీసుకోకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్న పుకార్లు రావటంతో... ఆ ప్రాంతాల మహిళలు ఒక్కసారిగా బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అపోహలు అవసరం లేదని... అజిత్‌సింగ్‌నగర్ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ రవికుమార్ స్పష్టం చేశారు. తమ బ్యాంకులో 4 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి... మహిళలకు నగదు అందిస్తున్నట్లు వివరించారు.
"అమ్మ ఒడి"పై షికారు చేస్తున్న పుకార్లు..! - Rumors circulating on "Amma Odi"scheme at vijayawada
అమ్మఒడి పథకం ద్వారా వచ్చే నగదు కోసం మహిళలు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. ఖాతా నుంచి డబ్బులు తీసుకోకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్న పుకార్లు రావటంతో... మహిళలందరు బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అపోహలు అవసరం లేదని ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ రవికుమార్ చెప్పారు.
"అమ్మ ఒడి"పై షికారు చేస్తున్న పుకార్లు
TAGGED:
"అమ్మ ఒడి తాజా వార్తలు