రాయలసీమలో వర్షాల జోరు కొనసాగనుంది.తాజాగా ఏర్పడిన ఉపరితల ద్రోణీ ప్రభావంతో సీమలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది.నెల్లూరు,ప్రకాశం,గుంటూరు,కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు,ఉభయగోదావరి,ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సీమలో మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు - రాయలసీమలో భారీ వర్షాలు
రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భారీ వర్షాలు
Last Updated : Sep 21, 2019, 12:12 PM IST