ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ తెలిపింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయన్న ఆర్టీజీఎస్ అధికారులు... దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.
నదులకు మళ్లీ వరదలు