నేడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగాల్పులు - ఆర్టీజీఎస్ - rtgs
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇవాళ.. వడగాల్పులు వీస్తాయని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు.
ఎండల నుంచి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీజీఎస్ సూచించింది.వారం రోజులుగా రాష్ట్రంలో వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మంగళవారం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినా..వేసవితాపం మాత్రం తగ్గలేదు.మధ్యాహ్నం సమయంలో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.చిన్నారులు,వృద్ధులు అవస్థలు పడుతున్నారు.నేడు రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని..ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించారు.