ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ డ్రైవరు నిర్లక్ష్యం.. సంస్థలో ఎక్కడా పనిచేయకుండా వేటు! - డ్రైవర్​పై ఆర్టీసీ చర్యలు

నిర్లక్ష్యంగా బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్​పై వేటు వేసింది. అతన్ని విధుల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

RTC
నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్​పై ఆర్టీసీ వేటు

By

Published : Feb 7, 2021, 3:36 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్.. నిర్లక్ష్యంగా బస్సు నడపిన వైనంపై ఆర్టీసీ చర్యలు చేపట్టింది. డ్రైవర్ వీరభద్రరావు ఈ నెల 3న విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు నాన్ స్టాప్ బస్సు నడిపారు. ఈ క్రమంలో సెల్ ఫోన్​లో చాటింగ్ చేస్తూ, పుస్తకం చదువుతూ డ్రైవింగ్​ చేశారు. గమనించిన ప్రయాణికులు తీరు మార్చుకోవాలని చెప్పినా పెడచెవిన పెట్టారు. ఆందోళనకు గురైన ప్రయాణికులు ఆధారాలతో సహా ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్​కు ఫిర్యాదు చేశారు.

ఘటనపై విచారణకు ఆదేశించిన ఎండీ... ఫిర్యాదు నిజమేనని తేలిన మేరకు.. డ్రైవర్​ను విధుల నుంచి తప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చర్యలు చేపడుతూ.. కృష్ణా జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సంస్థలో ఎక్కడా పనిచేసేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details