ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీకు నచ్చిన పింఛన్ ఎంచుకోవచ్చు - ఏపీ ఆర్టీసీ పింఛన్ వార్తలు

ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తీపి కబురును అందించనుంది.  పింఛన్​తో పాటుగా, వివిధ ప్రయోజనాలకు సంబంధించి ఐఏఏస్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో సూచించినట్లు సమాచారం. నేడు ఆర్టీసీని విలీనం చేసే బిల్లును  శాసన సభలో రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చ జరిపి,  సభ ఆమోదం తెలపనుంది.

ఆర్టీసీ
ఆర్టీసీ

By

Published : Dec 16, 2019, 9:11 AM IST

ఆర్టీసీ కార్మికులకు పాత లేదా కొత్త పింఛన్‌ను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని... ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో సూచించినట్టు తెలిసింది. పింఛన్‌తోపాటు, వివిధ ప్రయోజనాలకు సంబంధించి అధికారులు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో పీఎఫ్‌ అమల్లో ఉంది. ఉద్యోగి వాటా కింద జీతంలో 12 శాతం, యాజమాన్య వాటా కింద 12 శాతం కలిపి మొత్తం 24 శాతం చెల్లిస్తున్నారు. ఇందులో యాజమాన్య వాటా కింద ఇచ్చే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎఫ్‌కు వెళ్తుంది. మిగిలినది మాత్రం ఆర్టీసీలోని పీఎఫ్‌ ట్రస్ట్‌లో ఉంటుంది. ఇలా పీఎఫ్‌ ట్రస్ట్‌లో దాదాపు రూ.1200 కోట్ల వరకు ఉంది. అయితే ఉద్యోగుల జీతాలు, బస్సుల కొనుగోలు, ఇతర అవసరాల కోసం యాజమాన్యం వీటిలో చాలా వరకు నిధులు వాడేసుకుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ కింద చెల్లిస్తున్న 8.33 శాతం నుంచి.. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) కింద కొంత మొత్తాన్ని పదవీ విరమణ పొందిన కార్మికులకు పింఛన్‌గా ఇస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత భాగస్వామ్య పింఛన్‌ విధానం (సీపీఎస్‌) అమలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు పింఛన్‌ విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశాన్ని కార్మికులకు ఇవ్వాలని నివేదికలో పేర్కొన్నారు.
అలాగే ఇప్పటి వరకు వాడుకున్న పీఎఫ్‌ నిధులను ఏడాదిలోగా నెలకు కొంత చొప్పున ఆర్టీసీ జమ చేయాలని పేర్కొన్నట్టు తెలిసింది. ఎన్‌పీఎస్‌కు 8.33 శాతం కాకుండా ఆర్టీసీలో కార్మికులు ప్రతి నెలా ఉద్యోగుల పదవీవిరమణ ప్రయోజనం పథకం (ఎస్‌ఆర్‌బీఎస్‌) కింద జీతం నుంచి కొంత మొత్తం చెల్లిస్తుంటారు. ప్రస్తుతం ఉద్యోగులు సగటున నెలకు రూ.250 చెల్లిస్తున్నారు. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత నెలకు రూ.2,800 నుంచి రూ.3,200 వరకు పింఛన్‌గా ఇస్తారు. విలీనం తర్వాత ఈ పథకం రద్దుకానుంది. ఉద్యోగులు ఈ పథకం కింద ఇప్పటి వరకు చెల్లించిన ప్రీమియం డబ్బులను వెనక్కి ఇచ్చేలా ప్రతిపాదించారని తెలిసింది.
* కార్మికులు కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌)కి కొంత మొత్తం చెల్లిస్తున్నారు. వీటి నుంచి వారికి వివిధ రుణాలు ఇస్తారు. కొద్ది నెలలుగా కార్మికుల జీతం నుంచి తీసుకుంటున్న సీసీఎస్‌ నిధులను, సొసైటీకి జమ చేయడం లేదు. వీటిని వెంటనే జమ చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details