ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా భయంతో ఆర్టీసీ ఆదాయం తగ్గింది : ఎండీ కృష్ణబాబు - corona effect on apsrtc

కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ఆదాయం పూర్తిగా తగ్గిందని ఆ సంస్థ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ పురోగతిపై జిల్లాల ఆర్​ఎమ్​లతో ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.

కరోనా భయంతో ఆర్టీసీ ఆదాయం తగ్గింది
కరోనా భయంతో ఆర్టీసీ ఆదాయం తగ్గింది

By

Published : Jul 28, 2020, 9:24 PM IST

కరోనా భయంతో ఆర్టీసీ ఆదాయం తగ్గింది

జిల్లాల ఆర్‌ఎంలతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బందిపై కరోనా ప్రభావం, వైరస్ వ్యాప్తి నివారణపై చర్చించారు. ప్రజలకు సేవలు అందిస్తూనే సంస్థ ఆదాయం పెంచుకునే మార్గాలపై మాట్లాడారు. మే 21 నుంచి 30 శాతం బస్సులే నడుస్తున్నాయన్నారు. కరోనా భయం వల్ల ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గిందన్నారు. ఆర్టీసీలో వచ్చే ఆదాయం డీజిల్ ఖర్చుకే సరిపోతోందన్నారు. కరోనా సోకకుండా సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా సోకిన ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. విధుల్లో ఉన్నప్పుడు సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరాల మేరకు బస్సుల తగ్గింపు, పెంపుపై సమీక్షించాలన్నారు. కోవిడ్ వల్ల తగ్గిన ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో భర్తీ చేయాలని ఆదేశించారు. సరకు రవాణాతో ఆదాయం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బస్టాండ్ల పరిశుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details