ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2,494 ప్రత్యేక బస్సులు సిద్ధం.. అవసరమైతే మరిన్ని..! - ప్రత్యేక సర్వీసులను నడుపుతున్న ఆర్టీసీ

సంక్రాంతి సంబరాలకు సొంతూళ్లకు వెళ్లిన వాళ్లంతా.. తిరుగుపయనమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల ఆర్టీసీ ప్రాంగణాలు రద్దీగా మారాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు
ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు

By

Published : Jan 18, 2021, 7:15 AM IST

సంక్రాంతి పండుగను ముగించుకుని తిరుగు ప్రయాణమైన వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. సాధారణ సర్వీసులకు అదనంగా 2,494 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆది, సోమవారల్లో హైదరాబాద్ కు 631 బస్సులను వేశారు. ఆదివారం ఒక్కరోజే 359 బస్సులను నడిపారు.

రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా.. వివిధ జిల్లాల నుంచి విజయవాడ మీదుగా ఎక్కువ బస్సులు నడుస్తున్నాయి. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. ఆయా మార్గాల్లో రద్దీని బట్టి బస్సుల సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details