ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్టీసీ వినూత్న ఆలోచన... బస్సుల్లో పంట ఉత్పత్తుల తరలింపు

కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ డిపో అధికారులు వినూత్న ఆలోచన చేశారు. రైతులు పండించిన పంటను రవాణా చేసుకునేందుకు వాహనాల సదుపాయం లేనందున ఆర్టీసీ బస్సుల్లో తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సౌకర్యంపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

By

Published : May 9, 2020, 8:29 PM IST

Published : May 9, 2020, 8:29 PM IST

RTC innovative idea to move crop products in busses in avanigadda krishna district
బస్సుల్లో పంట ఉత్పత్తులు తరలింపు

కృష్ణా జిల్లా అవనిగడ్డ డిపో నుంచి 31 బస్సుల ద్వారా మొక్కజొన్నలను రవాణా చేస్తున్నారు. లాక్​డౌన్​తో లారీలు అందుబాటులో లేకపోవడం, డ్రైవర్లు దొరకకపోవడం వంటి కారణాలతో సకాలంలో పంటను రవాణా చేయలేని స్థితిలో ఉన్న అన్నదాతలకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతోంది. లారీల కన్నా తక్కువ ఛార్జీలతో బస్సులను ఏర్పాటు చేశామని అవనిగడ్డ డిపో మేనేజరు బి.కోటేశ్వర నాయక్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details