వయో వృద్ధులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువ శాతం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో... ప్రయాణాలు చేయకుండా వారిని ఆపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వయో వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చే 25 శాతం రాయితీ నిలిపివేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకే వృద్ధులకు రాయితీ నిలిపివేశామని ఆదేశాల్లో తెలిపారు. ఇప్పటికే రైల్వేశాఖ వయోవృద్ధులకు ఇస్తోన్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పుడు ఆర్టీసీ ఇదే బాటలో నడిచింది.
కరోనా కట్టడికి ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం - వయో వృద్ధులకు రాయితీ కట్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వయో వృద్ధులకు ఇస్తోన్న రాయితీని ఏపీఎస్ ఆర్టీసీ నిలిపివేసింది. వారి ప్రయాణాలు తగ్గించేందుకే ఈ నిర్ణయమని సంస్థ పేర్కొంది.
apsrtc