ఆర్టీసీ సిబ్బంది వేతనాల బకాయిల చెల్లింపుపై యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 2013 వేతన సవరణ బకాయిల చెల్లింపునకు అంగీకారం తెలిపింది. రూ. 210 కోట్ల వేతన సవరణ బకాయిలను ఈనెల 12న చెల్లించాలని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సంబంధింత విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం కానున్నారు. ప్రజా రవాణా విభాగం ఏర్పాటు చేసి జనవరి నుంచి ఆ డిపార్టుమెంట్ నుంచే వేతనాలు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ సమావేశాల్లో చట్టం చేయనుంది. విలీనం ప్రక్రియ ముందే వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎండీ కృష్ణబాబు వేతన బకాయిల చెల్లింపునకు ఉత్తర్వులిచ్చారు. ఆర్టీసీ ఎండీ కృష్ణబాబుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
ఆర్టీసీ కార్మికులకు శుభవార్త.. బకాయిల చెల్లింపునకు ఆదేశం - ఏపీఎస్ఆర్టీసీ వార్తలు
రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం శుభవార్త తెలిపింది. రూ.210 కోట్ల వేతన సవరణ బకాయిలను ఈనెల 12న చెల్లించాలని ఎండీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు.
rtc