విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ ప్రధాన కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు మధ్యాహ్నం వరకు బస్సులు నిలుపుదల చేస్తున్నట్లు ఈయూ నేతలు దామోదర్, వైవీరావు తెలిపారు. అన్ని డిపోల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించడం సహా స్టీల్ ప్లాంట్ అప్పులను కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా మార్చాలని ఈయూ నేతలు డిమాండ్ చేశారు.
రేపటి బంద్‌కు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్దతు - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ
కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు తలపెట్టిన రేపటి బంద్‌కు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరువుతామన్న నేతలు... స్టీల్ ప్లాంట్ అప్పులను కేంద్రం ప్రభుత్వం ఈక్విటీగా మార్చాలని డిమాండ్ చేశారు.

రేపటి బంద్‌కు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్దతు