జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్బన్నరెడ్డి తన వాహనాన్ని కొవిడ్ బాధితుల సేవకు వినియోగిస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. తన కారును కొవిడ్ రోగులను తీసుకెళ్లే అంబులెన్స్ తరహా వాహనంగా మార్చేశారు.
డిక్కీలో ఆక్సిజన్ సిలెండర్లను ఉంచి వెనుక సీటును బెడ్ గా మార్చారు. తమ కార్మికులు, వారి కుటుంబీకుల కోసం దీన్ని ఉపయోగిస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆయన్ను అభినందించారు.