కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు కాల్వలోకి దూసుకెళ్లింది. విజయవాడ నుంచి నూజివీడు వస్తున్న ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద ముందు టైరు పంచర్ కావడంతో కాల్వలోకి వెళ్లింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సంఘటన జరిగిన సమయంలో బస్సులో ఇరవై రెండు మంది ప్రయాణిస్తున్నారు.
పేలిన టైరు ... కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - కృష్ణా జిల్లా తాజా సమాచారం
టైరు పేలి బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. డ్రైవర్ అప్రమత్తతో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
RTC bus