గిరిజన సమస్యలు-ప్రభుత్వ వైఖరి అంశంపై విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దారు నాయక్ మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి వెనుకబడిన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఇవ్వనున్న పట్టాలను కేవలం వైకాపా కార్యకర్తలకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన అందరికీ భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసులపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి స్పందించకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
'ఆదివాసులపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి స్పందించాలి' - విజయవాడ తాజా వార్తలు
గిరిజనుల పట్ల ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తోందని ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దారు నాయక్ మండిపడ్డారు. ఆదివాసులపై జరుగుతున్న దాడులను ఖండించాలని ఆయన విజయవాడలో అన్నారు.
విజయవాడలో గిరిజన సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం