ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముఖ్యమంత్రికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు' - మూడు రాజధానులపై నిరసనలు న్యూస్

పాలనా వికేంద్రీకరణ విషయంలో ముఖ్యమంత్రికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు.

round table meeting about capital amaravathi
round table meeting about capital amaravathi

By

Published : Dec 19, 2019, 8:33 PM IST

'ముఖ్యమంత్రికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు'

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. వేలాది ఉద్యోగులను తరలించడం, మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదని చెప్పారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ పరిపాలన సాగించాలని... కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని... అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details