తమకు న్యాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని మానవ అక్రమ రవాణా బాధితులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అక్రమరవాణా బాధిత మహిళలు, బాలికలకు నష్టపరిహారం పునరావాసం కల్పించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు రూపొందించాయి. అందులో భాగంగా 'ఆంధ్రప్రదేశ్ బాధితుల నష్టపరిహారం' పథకాన్ని 2015 రూపొందించారు. ఈ పథకం ద్వారా 11 రకాల బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్ని పథకాలు రూపొందించిన అవి ఆచరణలో నూటికి ఒక శాతం బాధితులకు మాత్రమే అందుతున్నాయని బాధితులు తెలిపారు. 2015 నుండి 2018 వరకు మన రాష్ట్రంలో అక్రమ రవాణా నుంచి 1150 మందిని రక్షించినట్లు కేంద్ర నేర రికార్డుల సంస్థ ప్రకటించగా వారిలో కేవలం ఇద్దరికి మాత్రమే నష్టపరిహారం అందినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ తెలిపింది. బాధిత మహిళల కోసం రూ.16 కోట్ల నిధులను కేటాయించగా అందులో రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి బాధితులకు రెండు లక్షల రూపాయలు మాత్రమే వెచ్చించారని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
'మానవ అక్రమ రవాణా బాధితులకు న్యాయం చేయాలి'
మానవ అక్రమ రవాణా బాధితులకు పునరావాసం, నష్టపరిహారంపై విజయవాడలో స్వచ్ఛంద ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు రాజకీయ పార్టీ మహిళా ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బాధితుల సమస్యలపై చర్చించారు.
అక్రమ రవాణా బాధితుల పునరావాసం,నష్టపరిహారం పై రౌండ్ టేబుల్ సమావేశం