కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 18 లక్షల మేర నగదును ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు పోలీసులు వెల్లడించారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగతనం... 18 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగలు - పెడన ఎమ్మల్యే అప్డేట్
అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
![ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగతనం... 18 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగలు robbery in mla jogi ramesh house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10552251-1008-10552251-1612835985193.jpg)
ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగతనం