కృష్ణాజిల్లా నందివాడ మండలం తమిరిశలో... అర్ధరాత్రి దొంగల ముఠా హల్ చల్ చేసింది. ఓ ఇంట్లో ప్రవేశించి సెల్ ఫోన్లు చోరీ చేస్తుండగా... యజమాని గమనించి స్థానికుల సాయంతో... దొంగను పట్టుకున్నారు.
అర్ధరాత్రి దొంగల ముఠా హల్చల్... సెల్ ఫోన్ల చోరీకి యత్నం - కృష్ణా జిల్లోలో సెల్ఫోన్లు దోపీడి వార్తలు
కరోనా వేళ దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. నందివాడలో ఓ ఇంట్లోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులు అప్పగించారు. ఇంకొందరు తప్పించుకున్నారని... వారిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
Breaking News
అదే సమయంలో... మరో అపరిచిత వ్యక్తి గ్రామంలో తిరుగుతుండటంతో స్థానికులు అతన్ని పట్టుకునేందుకు యత్నించారు. అతను తృటిలో తప్పించుకున్నాడు. దొరికిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. తప్పించుకున్న ముఠాను పట్టుకునేందుకు గాలిస్తున్నారు పోలీసులు