కృష్ణా జిల్లా కోడూరు మండలలోని కొత్తపాలెం గ్రామంలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొద్దిపాటి వర్షానికే రహదారిపై నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.
ఉపాధి హామీ పధకం ద్వారా మంజూరైన నిధులతోనూ పనులు చేపట్టలేదని గ్రామస్థులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.