ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఉంటేనే రోడ్డు మీదకి రండి' - కృష్ణాజిల్లా తాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుందని నందిగామ పోలీసులు హెచ్చరించారు. 32 జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. డ్రైవింగ్ చేస్తున్న వారు తప్పనిసరిగా లైసెన్స్, హెల్మెట్ ఉంటేనే రోడ్డు మీదకి రావాలని పోలీసులు సూచించారు.

road safety week rally in nandigama
నందిగామ పోలీసులు

By

Published : Jan 20, 2021, 4:22 PM IST

32 జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కృష్ణాజిల్లా నందిగామ పోలీసులు.. పోలీస్​ స్టేషన్​ నుంచి గాంధీ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబం రోడ్డు మీద పడుతుందని పోలీసులు తెలిపారు. డ్రైవింగ్​ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్​ లైసెన్స్ ఉంటేనే తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు కొనివ్వాలని అన్నారు. డ్రైవింగ్ చేస్తున్న వారు తప్పనిసరిగా లైసెన్స్, హెల్మెట్ ఉంటేనే రోడ్డు మీదకి రావాలని తెలిపారు. ఈ ర్యాలీలో మహిళా పోలీసులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details