కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురం గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ గోవర్దన్ అనే వ్యక్తిని ఢీ కొట్టారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు గోవర్దన్ కైకలూరులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనం ఢీ కొని హోంగార్డు మృతి - over speed and accident
అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కృష్ణా జిల్లా జనార్దనపురంలో ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న ముగ్గురు యువకులు రోడ్డుపై నిలుచున్న వ్యక్తిని బలంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో అతను అక్కడి కక్కడే మృతి చెందాడు.
రోడ్డుప్రమాదం