విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి 65 రక్తసిక్తమైంది. కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద ఒకే రోజు ఐదు ప్రమాదాలు జరిగాయి. ఏడుగురికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనటంతో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. కీసర వద్ద కారు టైరు పేలటంతో రోడ్డు పక్కన్న కందకంలోకి వెళ్లింది. ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మిక్ కళాశాల సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి మరో రెండు ద్విచక్రవాహనాలను ఢీ కొంది. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కంచికచర్ల చెరువు కట్ట వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తికి గాయాలయ్యాయి.
అక్కడ ఒకే రోజు.. ఐదు రోడ్డు ప్రమాదాలు - krishna
కంచికచర్ల వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒకే రోజు ఐదు ప్రమాదాలు జరిగాయి.

ఒకే రోజు.. ఐదు రోడ్డు ప్రమాదాలు