No Compensation to Road Accident Victims : ఆనందంతో వారందరూ వివాహానికి బయలుదేరారు. ఒక్కసారిగా పెను ప్రమాదం జరిగింది. ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో ఆటో బోల్తా పడి అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది ఇప్పటి విషయం కాదు. ఈ ఘటన జరిగి 9 నెలలు అయ్యింది. వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇది విన్న ప్రతి ఒక్కరి మనసు కలచి వెేసింది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేయాలనీ భావించారు. వారి గురించి తెలుసుకుని సపర్యలు చేశారు. సహాయం చేయలేకపోయినా కనీసం వారిలో బాధ కనపడుతుంది. సహాయం చేయగలిగే భాద్యత ఉన్నా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అధికారులు, ప్రభుత్వం. అధికారులు, రాజకీయ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నో రోజులు వేచి చూసిన బాధిత కుటుంబాలు న్యాయం చేయాలంటూ సోమవారం "సత్యాగ్రహ దీక్ష" సోమవారం చేశారు.
ఎంతమందికి పరిహారం ఇవ్వాలి..? :కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం చింతలమడ గ్రామం నుండి మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి 2002 మే 26న వివాహానికి ఆటోలో వెళ్తుండగా.. కాసానగర్ వద్ద ఆటో బోల్తాపడి అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. ఘటన జరిగి 9 నెలలు గడిచినా చింతలమడ వైపు కన్నెత్తి చూడలేదని.. మృతులకు బీమా, గాయాల పాలైన వారికి నష్ట పరిహారం కూడా చెల్లించలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్యెల్యే, మంత్రులు, కలెక్టర్ వద్దకు వెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని.. అదీకాకుండా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి... ఎంతో మంది మృతి చెందుతుంటారు.. అందరికీ పరిహారం ఇస్తారా అని అధికారులు అంటున్నారని గ్రామస్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవయవాలు కోల్పోయిన బాధితులకు నేటికీ వికలాంగుల పెన్షన్ అందలేదని వాపోయారు.