కృష్ణా జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థ నగర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు . సిద్ధార్థ నగర్ కు చెందిన కృష్ణ అనే యువకుడు తన ద్విచక్రవాహనంపై రెడ్డిగూడెం నుంచి సిద్ధార్థ నగరం వస్తుండగా ప్రమాదానికి గురై మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయి ఉండవచ్చని వారు అనుమానిస్తూ...ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - nuzeveed
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థ నగర్లో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి