ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై ప్రమాదం - విజయవాడలో కారు ఆటో ప్రమాదం

Accident: విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా..ఇద్దరు సైకిలిస్టులు, ఆటో డ్రైవర్ గాయపడి ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు.

Road accident
రోడ్డు ప్రమాదం

By

Published : Dec 10, 2022, 6:34 PM IST

Accident: విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారులో నలుగురు ప్రయాణికులు విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళుతూ ఓవర్ స్పీడ్ తో కారు డ్రైవింగ్ చేస్తుండగా, కారు అదుపుతప్పి, దావులూరు నుంచి ఉయ్యూరు వైపు వెళ్లు ఇద్దరు సైకిలిస్టులను, ఆటోను ఢీకొట్టి 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ప్రమాదానికి కారణమైన కారులో, డ్రైవింగ్ చేస్తున్న ఒక మహిళకి బలమైన గాయాలు అవడంతో మృతి చెందింది.

ఆటో డ్రైవర్ సాంబశివరావు (ప్రయాణికులు లేకుండా) డ్రైవ్ చేస్తూ ఉయ్యూరు వెళ్లే క్రమంలో, కారు అదుపు తప్పి ఢీ కొట్టింది. సాంబశివరావుకు బలమైన గాయాలై పరిస్థితి విషమంగా ఉంది. సైక్లిస్టులు తీవ్రంగా గాయపడడంతో వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details