ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీకొన్న టాటా మ్యాజిక్.. 9 మందికి గాయాలు - road accident at mari bandham

ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం.. నూజివీడు మండలం మరిబంధం వద్ద లారీని ఢీకొంది. 9 మందికి గాయాలు కాగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిలో ఐదుగురిని విజయవాడ, ఏలూరు ఆస్పత్రులకు పంపిచినట్లు వైద్యులు వెల్లడించారు.

tata magic accident
టాటా మ్యాజిక్ ప్రమాదం

By

Published : Nov 1, 2020, 3:40 PM IST

పదకొండు మందితో ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనం.. కృష్ణాజిల్లా నూజివీడు మండలం మరి బంధం వద్ద లారీని ఢీకొంది. తిరూవూరు మండలం నూతిపాడు నుంచి బాపులపాడు మండలం ఆరుగొలను వెళ్తుండగా జరిగిందీ ఘటన.

9 మందికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రులను 108 సిబ్బంది నూజివీడు ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం వారిలో ఇద్దరిని విజయవాడ, ముగ్గురిని ఏలూరు ఆస్పత్రులకు తరలించినట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details