కృష్ణాజిల్లా బొమ్ములూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, ముగ్గురు మృతి - కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం
07:12 December 07
కృష్ణాజిల్లా బొమ్ములూరు వద్ద రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. బొమ్ములూరు వద్ద ఆగి ఉన్న లారీని.. కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3గంటల30 నిమిషాలకు ఘటన జరిగింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. గాయాలైన నలుగురిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భీమవరంలో వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. కారులో చిక్కుకున్న మృతులను క్రేన్ సహాయంతో పోలీసులు బయటకు తీశారు. మృతుల్లో ఒకరు విజయవాడ వాసిగా.. మరో ఇద్దరు చింతలపూడి మండలం ఎర్రగొండపల్లికి చెందిన దంపతులుగా గుర్తించారు.
ఇదీ చదవండి:ఏలూరు: అంతుచిక్కని వ్యాధి.. వందలాదిగా ఆసుపత్రులపాలు