కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక వడ్డే నగర్‌కు చెందిన గోపాల్, కోటయ్య నగర్‌కు చెందిన సాగర్, నరసయ్య ఖిల్లా రోడ్డు సెంటర్ నుంచి ద్విచక్ర వాహనంపై బీ కాలనీ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న పానీపూరి బండిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గోపాల్, సాగర్‌తో పాటు పానీపూరి బండి యజమాని నిఖిలేష్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు 108లో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పానీపూరి బండిని ఢీకొట్టిన బైక్.. నలుగురికి తీవ్రగాయాలు - road accident in ibraheeepatnam
పానీపూరి బండిని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
road accident in inbraheempatnam