ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం.. లారీ ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి - గుడివాడ రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం జరిగింది. సరదాగా సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీదకు వచ్చిన చిన్నారులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు మృతిచెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలపాలయ్యాయి.

road accident in gudivada krishna district
లారీ ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి

By

Published : Sep 18, 2020, 8:46 PM IST

కృష్ణా జిల్లా గుడివాడ నలంద పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 5 సంవత్సరాల మోహిత్, మరో బాలుడితో కలిసి సరదాగా సైకిల్ తొక్కుకుంటూ రోడ్డుమీదకు వచ్చాడు. వారిని లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్ వెనుక కూర్చున్న మోహిత్ అక్కడికక్కడే మృతిచెందగా.. సైకిల్ తొక్కుతున్న మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు తమ కళ్లముందు ఆడుకున్న బాలుడు విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ABOUT THE AUTHOR

...view details